Tuesday, November 26, 2024

Delhi: జాతీయ అవార్డుల నామినేషన్లకు ఉమ్మడి పోర్టల్.. ప్రజల భాగస్వామ్యం పారదర్శకంగా ఎంపిక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పౌరులు, ప్రభుత్వోద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జాతీయ అవార్డుల ఎంపిక ప్రక్రియలో మరింత పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ ఏర్పాటు చేసింది. ఇక నుంచి ఈ ఉమ్మడి జాతీయ అవార్డుల పోర్టల్ ( https://awards.gov.in ) ద్వారా సంబంధింత రంగాలకు చెందినవారు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో అవార్డుల కోసం నామినేషన్లు, సిఫార్సులు స్వీకరించేందుకు చివరి తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలు..

i. పద్మ పురస్కారాలు – చివరి తేదీ 15/09/2022
ii. డిజిటల్ ఇండియా పురస్కారాలు – చివరి తేదీ 15/09/2022
iii. నేషనల్ అవార్డ్ ఎక్సలెన్సీ ఇన్ ఫారెస్టీ-2022 (చివరి తేదీ 30 సెప్టెంబర్ 2022)
iv. నేషనల్ గోపాల రత్న పురస్కారం-2022 (చివరి తేదీ 30 సెప్టెంబర్ 2022
v. నేషనల్ వాటర్ అవార్డ్సు-2022 (చివరి తేదీ 15 సెప్టెంబర్ 2022)
vi. నారీ శక్తి పురస్కారం-2023- చివరి తేదీ 31/10/2022
vii. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం-2023 చివరి తేదీ 30/09/2022
viii. జీవన్ రక్షా పదక్ – చివరి తేదీ 30/09/2022

Advertisement

తాజా వార్తలు

Advertisement