Saturday, November 23, 2024

CPGet‌ Notification : జులై 20న కామన్‌ పీజీ సెట్‌.. ఇతర రాష్ట్ర విద్యార్థులకు 20 శాతం సీట్లు..

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జులై 20న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. జూన్‌ 6వ తేదీ నుంచే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. దరఖాస్తు గడువు జులై 4 వరకు విధించారు. రూ.500 అపరాధ రుసుముతో జులై 11 వరకు, రూ.2వేల అపరాధ రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు స్వీకరణకు అవకాశం కల్పించారు. సీబీటీ పద్ధతిలో పరీక్షను నిర్వహించనున్నారు. సోమవారం మాసాబ్‌ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి, వైస్‌ ఛైర్మన్‌ వి.వెంకటరమణ, సెక్రటరీ శ్రీనివాస్‌రావు, ఓపెన్‌ వర్సిటీ వీసీ సీతారాములు, సీపీగెట్‌ కన్వీనర్‌ పాండురంగారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్శంగా లింబాద్రి మాట్లాడుతూ అన్ని యూనివర్సిటీల పరిధిలో మొత్తం 44 వేలకు పైగా సీట్లు ఉన్నాయని, వాటిలో నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ కోటా కింద ఇతర రాష్ట్ర విద్యార్థులకు 20 శాతం సిట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతేడాది పీజీ కోర్సుల్లో 71 శాతం అమ్మాయిలు అడ్మిషన్లు పొందినట్లు తెలిపారు. ఎంఏ తెలుగు/ఇంగ్లీష్‌, సోషల్‌ సైన్సెస్‌ కోర్సులకు డిగ్రీ విద్యార్థులందరూ అర్హులేనన్నారు. డిస్టెన్స్‌ కోర్సులకు ఆప్షనల్‌ సబ్జెక్టుగా పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీల వారీగా వేరువేరుగా ఫీజులను వసూలు చేయనున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement