Monday, November 18, 2024

సూసైడ్ చేసుకుంటున్నాం.. భార్య‌భ‌ర్త‌ల సెల్ఫీ వీడియో క‌ల‌క‌లం..

విశాఖ జిల్లా వడ్లపూడి తిరుమల నగర్ లో భార్య‌భ‌ర్త‌లు సూసైడ్ సెల్ఫీ క‌ల‌క‌లం రేపింది. ఆర్థిక ఇబ్బందులు కార‌ణంగా భార్య భ‌ర్త‌లు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు మేం సూసైడ్ చేసుకుంటున్నాం అంటూ చిత్రాడ వరప్రసాద్(47) స్టీల్ ప్లాంట్ ఉద్యోగి, భార్య మీరా(41)లు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియోను బంధువులకి, కుటుంబ సభ్యులకి ఆ వీడియోను పంపించారు. అనంత‌రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కుమారుడు కిృష్ణ సాయితేజ దువ్వాడ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశాడు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ వద్ద చెప్పులు, హ్యాండ్ బ్యాగు, మొబైల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధిత కుంటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు దువ్వాడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement