Thursday, November 21, 2024

ఎలక్ట్రికల్‌ వాహనాల ప్రమాదంపై కమిటీ.. ఏం తేలుస్తరో చూడాలే!

ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్‌ టూ వీలర్స్‌లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. రెండు రోజుల క్రితం టాటా నెక్సాన్‌ కారులోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. వీటిపై నిపుణులతో కమిటీ వేసినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ప్రమాదాలకు గల కారణాలు, నివారణ చర్యలు వంటి అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. ఈ నిపుణుల కమిటీ ప్రధానంగా బ్యాటరీల ప్రమాణాలు, ఎలాంటి మెటిరీయల్స్‌ను వాడుతున్నారు, నాణ్యత వంటి అంశాలను పరిశీలిస్తుంది.

బ్యాటరీల్లో లోపాలు, నాసిరకం పరికరాలు వాడినట్లు కమిటీ నివేదికలో తేలితే అలాంటి వాహనాలను అన్నింటినీ వెనక్కి పిలిపిస్తామని, ఇలాంటి కంపెనీలపై భారీ జరిమానాలు, చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement