దేశ వ్యాప్తంగా ఇప్పటికే పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలతో సామాన్యుడు సతమతం అవుతున్నాడు. పెట్రోల్, డీజెల్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కొన్ని రోజుల నుంచి స్థిరంగా ఉన్నప్పటికీ.. సామాన్యుడు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ తరుణంలో కమర్షియల్ గ్యాస్ ధరలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర రూ.102.50 పెరిగింది. ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటవ తేదీన సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగానే మే 1వ తేదీన కూడా సిలిండర్ ధరలను సవరించాయి. ఈ క్రమంలో సామాన్యులకు, వ్యాపారులకు మరో షాక్ ఇచ్చాయి. తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర (19 కేజీలు) రూ.102.50 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లిdలో 19 కేజీల సిలిండర్ ధర రూ.2,355.50కు చేరుకుంది. అంతకుముందు రూ.2,253గా ఉంది. కాగా ఏప్రిల్1న 19 కేజీల సిలిండర్ ధరను ఒకేసారి రూ.250 పెంచిన విషయం తెలిసిందే.
స్థిరంగా డొమెస్టిక్ సిలిండర్ల ధరలు..
ఇక ఇళ్లలో ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. చివరిసారిగా మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్ రేటును రూ.50పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,002గా ఉంది. చిన్న గ్యాస్ సిలిండర్ (5కేజీలు) రూ.655గా ఉంది. ఇక పెరిగిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,563 ఉంది. విశాఖపట్నంలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,413గా ఉంది. విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,501గా ఉంది. తాజాగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలతో.. చిరు వ్యాపారులు, హోటల్ యజమానులపై తీవ్ర ప్రభావం పడుతుంది. నెలకు ఐదు సిలిండర్లు వినియోగిస్తే.. రూ.3000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.976, చెన్నైలో రూ.965.50, ఢిల్లిdలో రూ.949, హైదరాబాద్‌లో రూ.1002, ముంబైలో రూ.949.50గా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..