అయోధ్య రామ మందిరం అంటేనే భారతీయుల చిరకాల వాంఛ. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే నేడు రామాలయ గర్భగుడి నిర్మాణ పనులను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గర్భగుడికి శంకుస్థాపన పూజ చేశారు. మొదట్లో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించారు. ఇప్పుడు గర్భగృహాన్ని నిర్మించనున్నారు. ఆలయ నిర్మాణంలో ముఖ్యమైన పనులు నేడు ప్రారంభించనున్నట్లు అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మెన్ నిపేంద్ర మిశ్రా తెలిపారు. 2023 లోగా ఆలయ గర్భగృహాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇక 2024 లోపు ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. ఇక ఆలయ నిర్మాణంలో భాగమైన కాంప్లెక్స్‌ను 2025లోగా పూర్తి చేస్తామని నిపేంద్ర మిశ్రా చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement