హైదరాబాద్, ఆంధ్రప్రభ : బంజారాహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో కాపర్ వైర్ బండిల్ళను చోరీ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 38 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన కాపర్ బండిళ్ళను క్రిష్ణానగర్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో టోలీచౌకీలోని సెకండ్ లాన్సర్‌కు చెందిన సోనూఖాన్, అస్సాంకు చెందిన సౌరబ్ బిస్వాస్, ఓడిషాకు చెందిన బికాష్ రంజన్ బెహెరా ఉన్నారు.
ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న శంకర్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో కాపర్ వైర్ బండిళ్ళను కొనుగోలు చేసిన స్క్రాప్ వ్యాపారులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సోనూఖాన్ అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, స్టోర్ హెల్పర్‌గా పని చేస్తున్న శంకర్‌తో పాటు సౌరబ్ బిశ్వాస్, బికాష్ రంజన్ బెహరాలు కలిసి పథకం ప్రకారం కాపర్ బెండిళ్ళను చోరీ చేసి ఎన్బీటీ నగర్, బల్కంపేట, ముషీరాబాద్‌లలోని ముగ్గురు స్క్రాప్ వ్యాపారులకు విక్రయించారని పోలీసులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.