రాగల మూడు రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఏపీ, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల వరకు ద్రోణి ఆవరించి ఉంది. ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే… ఈరోజు నైరుతి, తూర్పు, దక్షిణ జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ కూడా టీడీపీ నుంచే వచ్చాడు.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కాంగ్రెస్ కౌంటర్..