జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచాడు.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. తనపై వచ్చిన ఆరోపణలపై హైపర్ ఆది దీనిపై స్పందించాడు. తాను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని, స్క్రిప్ట్ తాను రాయలేదు.. తాను కేవలం ఆర్టిస్ట్‌ను మాత్రమే అని వివరించాడు.
కాగా ఓ కార్యక్రమంలో తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా హైపర్ ఆది మాట్లాడినట్లు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ఆరోపించింది. ఈ మేరకు ఆది, స్క్రిప్ట్ రైటర్‌తో పాటు మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది.