మావోయిస్టులతో తాము చర్చలకు సిద్ధమని చత్తీస్ఘడ్ ప్రకటించిన నేపథ్యంలో.. తాము సైతం సర్కారుతో చర్చలకు సిద్ధమని మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఈ మేరకు మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట లేఖను విడుదల చేసింది.
అనుకూల వాతావరణం కల్పిస్తే చర్చలకు ముందుకు వస్తామని స్పష్టం చేశారు. తొలుత సాయుధ బలగాలను ఆరునెలల పాటు శిబిరాలకే పరిమితం చేయాలని, కొత్త క్యాంపులను ఏర్పాటు చేయకూడదని, తప్పుడు ఎన్ కౌంటర్లను అరికట్టాలని ఈ లేఖలో మావోయిస్టులు ప్రస్తావించారు.