న్యూఢిల్లీ : త్రివిధ దళాల్లో సేవలు అందించిన 100 ఏళ్ల లెఫ్టినెంట్ కల్నల్ ప్రీతిపాల్ సింగ్ గిల్ సోమవారం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్వగృహంలోనే సింగ్ కన్నుమూశారు. వరల్డ్ వార్ 2లో ఆయన పాల్గొన్నారు. రాయల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తరఫున సేవలు అందించారు. రాయల్ ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీలో కూడా విధులు నిర్వర్తించారు.
మూడు దళాల యూనిఫాం వేసుకుని దేశానికి ఎనలేని సేవ చేశారు. లాహోర్‌లోని ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ పట్టా పొందిన గిల్.. అక్కడే వాల్టన్ ఏరోడ్రోమ్‌లో ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు. ఆ తరువాత రాయల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో జాయిన్ అయ్యారు. కరాచీలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం నేవీకి సేవలు అందించారు. మైన్ స్వీపింగ్ షిప్‌పై విధులు నిర్వర్తించారు. స్వాతంత్య్రం వస్తుందన్న సమయంలో ఆర్మీలో జాయిన్ అయ్యారు.