కళాశాలల ఏర్పాటుకు, నిర్వహణకు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి ఉండాలి. ఇందకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, తెలంగాణ ఉన్నత విద్య మండలి లేదా ఇతర సంస్థల నుంచి గుర్తింపు అనుమతిని కచ్చితంగా తీసుకోవలసి ఉంటుంది. కానీ తెలంగాణలో ఈ ప్రభుత్వ రంగ సంస్థల అనుమతుల్లేకుండానే ప్రైవేట్ కాళశాలలు యథేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో 31 శాతం వరకు
కాలేజీలు ఎలాంటి గుర్తింపుల్లేకుండా నడుస్తున్నాయని తెలుస్తోంది. వీటిలో డిగ్రీ, పీజీ, మెడికల్ కాలేజీలు, ఫార్మసీ, బీఈడీ, హోటల్ మేనేజ్‌మెంట్, లా, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ ఇతరత్రా కాలేజీలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం ఇటీవల సెస్ (ఆర్థిక సామజిక అధ్యయణ సంస్థ) నిర్వహించిన అధ్యయనంలో బట్టబయలైంది.
రాష్ట్రంలో సుమారు 2,200 వరకు డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మీసీ, ఇంజనీరింగ్‌తో పాటు ఇతర ఉన్నత
విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో 31 శాతం వరకు కాలేజీలకు ప్రభుత్వ గుర్తింపులేకుండానే నడుస్తుం డటం అధికారుల అలసత్వానికి నిదర్శన మని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుర్తింపుల్లేని కాలేజీలు ఎక్కువగా గ్రామీణా ప్రాంతాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కళాశాలలకు గుర్తింపు ఉందా? లేదా? అని
చూసుకోకుండానే విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వాటిలో అడ్మిషన్లు పొందుతున్నారు. చదువు ముగిసిన తర్వాత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం ఈ విషయంలో తమకు ఏమిపట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే ఉన్నత విద్యను బోధించే కాలేజీలు అత్యధి కంగా హైదరాబాద్ నగరంలోనే ఉన్నట్లు సెస్ తన నివేదికలో పొందుపర్చినట్లుగా తెలిసింది. హైదరాబాద్‌లో 320 కాలేజీలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 230 ఉన్నట్లుగా గుర్తించింది. ఆతర్వాత అత్య
ధికంగా కాలేజీలు ఉన్న జిల్లాలు నల్గొండ,కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఉన్నట్లుగా తెలిసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..