Sunday, November 17, 2024

సెలవుల్లోనూ కాలేజీలు! సంక్రాంతి హాలిడేస్‌ ఇవ్వని పలు విద్యాసంస్థలు..

రాష్ట్రంలోని పలు కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు తమకు ఏమాత్రం పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సెలవులను ముందస్తుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. అయితే కొన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యా సం స్థలు ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తరగతులను నిర్వహిస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో ఈ తరహా తంతు ఎక్కువగా నడుస్తున్నట్లుగా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులకు సెలవులు ప్రకటించకుండా కనీసం కోవిడ్‌ నిబంధనలు అమలు చేయకుండానే తరగతులు నిర్వహిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ విధంగా నిర్వహిస్తున్న పలు కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యా సంస్థలు, యూనివర్సిటీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్‌.మూర్తి, టి.నాగరాజు డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండా : అకాల వర్షం ఆందోళనలో రైతులు..

ప్రభుత్వం ప్రకటించిన సెలవులను అమలు చేయకుండా విద్యాసంస్థలతను నడుపుతుండటాన్ని తప్పుబట్టారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశించిన విధంగా సంక్రాంతి సెలవులను విద్యార్థులకు ఇస్తే ఇకపై ఫీజులు వసూలు చేయడం తమకు కష్టమవుతుందనే భావనలో విద్యా సంస్థలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా ఫీజులు వసూలు చేసుకునేం దుకుగానూ క్లాసుల పేరుతో విద్యాసంస్థలను ఇంకా నడుపుతున్నట్లుగా ఆరోపిస్తున్నారు. మొత్తం ఫీజును ఒకేసారి చెల్లించాలని విద్యార్థులు, తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై ప్రభు త్వం కఠినంగా వ్యవహరించాలని వారు ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే ఈ విద్యా సంస్థలు గురువారం నుంచి సంక్రాంతి సెలవులను ఇవ్వనున్నట్లు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement