తెలంగాణలో 12ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా 12స్థానాలు కూడా టిఆర్ ఎస్ గెలిచే ఛాన్స్ ఉందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంతో అభ్యర్థుల వేటలో అధికార టీఆర్ఎస్ పార్టీ పడింది. అందులో భాగంగా ఒక జిల్లా కలెక్టర్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం సిద్ధిపేట్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకట్రామి రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అనే ప్రచారం సాగుతుంది. వెంకట్రామి రెడ్డి పలుమార్లు అధికార పార్టీకి మద్దతుగా మాట్లాడి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల వరి విత్తనాల అమ్మకం విషయం లో కూడా వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి లో పడ్డారాయన. కాగా వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ టీకెటు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సుముఖతని వ్యక్తం చేస్తున్నారట. చూడాలి మరి ఏమవుతుందో.
Advertisement
తాజా వార్తలు
Advertisement