Saturday, November 23, 2024

మట్టి మాఫియా పై కలెక్టర్ సీరియస్.. మట్టి తవ్వకాలపై కొలతలు..

ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు గండికొట్టి అక్రమంగా మట్టిని తరలిస్తున్న మాఫియా పై జిల్లా కలెక్టర్ దృష్టి సారించారు. మట్టి అక్రమ రవాణాపై ఆంధ్రప్రభ దినపత్రికలో వరుస కథనాలతో స్పందించిన కలెక్టర్ మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటుక బట్టీల కోసం యజమానులు రాయల్టీ కట్టిందెంత, అక్రమంగా మట్టిని ఈ మేరకు తవ్వారు ఎంత తరలించారు అనే అంశాలపై పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ఆదేశాలు ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ మైనింగ్ రెవెన్యూ అధికారులు రాఘవాపూర్ చెరువుల్లో తనిఖీలు ప్రారంభించారు. మైనింగ్ అధికారులు చెరువులో మట్టి మాఫియా చేపట్టిన తవ్వకాలపై కొలతలు వేస్తున్నారు. చెరువు సమీపంలోనీ పొలాల్లో మట్టి నిల్వలపై దృష్టి సారించారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తే ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు ఆదాయం చేకూరే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా అధికారులు మామూళ్ల మత్తు వీడి అక్రమ మట్టి రవాణా పై నిజానిజాలు తేల్చి జిల్లా కలెక్టర్ కు సమగ్ర నివేదిక అందజేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా తరలించిన మట్టితో ప్రభుత్వ ఖజానాకు గండి పడిందని, తవ్వకాలు జరిపిన వారి నుండి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఖజానాకు జమ చేయించాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement