Saturday, November 9, 2024

కుప్పకూలిన క్రిఎ్టో కరెన్సీలు..

ప్ర‌భ‌న్యూస్: ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్సియల్‌ మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితులు క్రిఎ్టో కరెన్సీ మార్కెట్లను వణికిస్తున్నాయి. ఇతర క్రిఎ్టో కరెన్సీల బాటలోనే బిట్‌కాయిన్‌ కూడా భారీగా పతనమైంది. దాదాపు 20 శాతం మేర క్షీణించి 42,296 డాలర్లకు పడిపోయింది. సింగపూర్‌ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దాదాపు 11 శాతం మేర కోలుకుని 47,600 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయ్యింది. రెండవ అతిపెద్ద డిజిటల్‌ కరెన్సీ ఈథర్‌ దాదాపు 17.4 శాతం నష్టపోయింది. అనంతరం 10 శాతం మెరుగుపడింది. మొత్తంగా క్రిఎ్టో కరెన్సీ సెక్టార్‌ తన వ్యాల్యూలో దాదాపు 5 శాతం మేర పతనమైంది. అంటే దాదాపు 2.2 ట్రిలియన్‌ డాలర్లు ఆవిరైపోయాయని క్రిఎ్టో కరెన్సీ ట్రాకర్‌ కాయిన్‌ గెకో తెలిపింది.

గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ మార్కెట్లలో హెచ్చుతగ్గుల పరిస్థితుల కారణంగా క్రిఎ్టో కరెన్సీ మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా కేంద్ర బ్యాంకులు మోనిటరీ పాలసీలను కఠినతరం చేసే అవకాశాలున్నాయి. క్రిఎ్టో కరెన్సీ మార్కెట్లలో భయాలకు కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ కూడా ఒక కారణంగా ఉంది. ఒమిక్రాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటే గ్లోబల్‌ ఎకానమీ మరోసారి నెమ్మదించొచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్‌లో రికార్డ్‌ స్థాయికి గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 4 శాతం పతనమయ్యాయి. ఇదే సమయంలో ట్రెజరీస్‌ వంటి అసెట్స్‌లో ర్యాలీ కనిపిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement