భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి చైనా ప్రజలు తేరుకోకముందే.. ఆ దేశంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో సంభవించిన పెను ప్రమాదంలో 12మంది మృతిచెందగా.. మరో13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చైనాలోని ఈశాన్య ప్రావిన్స్ హీలాంగ్‌జియాంగ్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వివరాలు ప్రకారం… హెంగ్షాన్ జిల్లా జిక్సీ నగరంలోని కున్యువాన్ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. బొగ్గు గనిలో సంభవించిన ఈ ప్రమాదంలో 12 మంది సజీవ సమాధి అయ్యారు.. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంకు కారణం ఇంకా తెలియరాలేదు. చైనా బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరగడం సర్వసాధారణమే. గత కొన్ని సంవత్సరాలుగా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. చైనా అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి దేశం మాత్రమే కాదు.. అతి పెద్ద వినియోగ దేశం కూడా.