కోల్ కత్తా – పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల్లోని ఇటుక బట్టీలోని చిమ్నీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బట్టీలో పనిచేస్తున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు.30 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. ఈ ఘటన 24 పరగణాస్‌లోని బసిర్‌హత్‌లోని ధాల్టితా గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్కడి ఇటుక బట్టీలో యథావిధిగా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 60 మందికి పైగా కూలీలు పనులు చేసుకుంటున్నారు. ఇంతలో ప్రధాన చిమ్నీ దిగువ నుండి విరిగిపోయి ఒక వైపు ఒరిగిపోయింది. ఈ చిమ్నీని చూసిన కార్మికులు అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నంలోనే చిమ్నీ కార్మికులపై పడింది. ఈ చిమ్నీ కూలడంతో మొత్తం 33 మంది కూలీలు గాయాలయ్యాయి.వీరిలో మగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన 31 మంది కూలీలను ఆస్పత్రికి తరలించారు.