గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా రాజ్‌కోట్ విమానాశ్రయం టెర్మినల్ వెలుపల పైకప్పు కూలింది. ప్యాసింజర్ పికప్ అండ్ డ్రాప్ ఏరియా వెలుపల పైకప్పు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు..
జబల్ పూర్ ఎయిర్ పోర్ట్ లోనూ…
జబల్‌పూర్ ఎయిర్‌పోర్టు షెడ్డు కూలిపోయింది. 450 కోట్ల రూపాయలతో జబల్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన దుమ్నా విమానాశ్రయం షెడ్డు తొలి వర్షంలోనే కారుపై పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ యాదవ్ వీడియోను షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితమే మోడీ ఈ టెర్మినల్‌ను ప్రారంభించారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన దుమ్నా విమానాశ్రయం ఎగువ బాల్కనీ అకస్మాత్తుగా పడిపోయింది. ఈ సమయంలో అక్కడ నిల్చున్న ఓ అధికారి కారు తీవ్రంగా ధ్వంసమైంది. ఎవరికీ గాయాలు కాకపోవడం విశేషం. లేకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. .