Saturday, November 23, 2024

తక్కువ వడ్డీతో కార్ల కొనుగోళ్లకు సహకరించండి.. కేంద్రానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి

పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ముద్ర లోన్ ద్వారా 60 పైసల వడ్డీకే కార్లు కొనుగోలు చేసి క్యాబ్‌లుగా తిప్పుకునేందుకు సహకరించవలసినదిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. జాతీయ బీసీ సంఘం ఉపాధ్యక్షుడు ప్రసాద్ యాదవ్, అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ శనివారం న్యూఢిల్లీలో సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలేను కలిసి ఈమేరకు వినతిపత్రం సమర్పించారు.

అలాగే పది శాతంలోపు మాత్రమే కమిషన్ క్యాబ్‌ల యాజమాన్యాలు కట్ చేసుకునేలా న్యాయబద్దమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన ఆయన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఈ అంశం చర్చిస్తానని హామీ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement