Friday, November 22, 2024

CJI | కొలీజియం చురుగ్గా ఉంది.. సీజేఐ డీవై చంద్రచూడ్​

సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ సమర్థవంతంగా, చురుగ్గా ఉందని సీజేఐ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. తాము సిఫార్సు చేసిన 72 గంటల్లోనే సుప్రీం కోర్టుకు ఇటీవల ఇద్దరు న్యాయమూర్తుల నియామకం జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తద్వారా కొలీజియం చురుగ్గా పనిచేస్తోందనే సందేశాన్ని దేశానికి పంపిందని ఆయన తెలిపారు. కొలీజియం ప్రక్రియలో ప్రభుత్వం భాగస్వామి అనే విషయాన్ని మనం అంగీకరించాలి. పేర్లను సిఫార్సు చేసిన తర్వాత, 72 గంటల కంటే తక్కువ వ్యవధిలో జరిగిన నియామకాల ద్వారా కొలీజియం శక్తివంతమైనది, చురుకైనది అనే సందేశాన్ని దేశానికి ఇవ్వగలిగామని నేను భావిస్తున్నాను.

కొలీజియం దాని విధికి కట్టుబడి ఉందనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ కేవీ విశ్వనాథ్‌ల గౌరవార్థం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి హాజరైన న్యాయవాదులు, న్యాయమూర్తుల సమావేశంలో చంద్రచూడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కొలీజియం చేసే అన్ని నియామకాలలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులందరినీ సంప్రదిస్తారని, అత్యున్నత న్యాయస్థానానికి జరిగే ప్రతి నియామకం దాని న్యాయమూర్తుల గౌరవం, ఆప్యాయతను కలిగివుండటానికి ఇదే కారణమని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement