Wednesday, November 20, 2024

తెలంగాణపై చలి పంజా.. పడిపోతున్న ఉష్టోగ్రతలు..!

తెలంగాణ‌లో చ‌లి తీవ్ర‌త పెరుగుతూ వ‌స్తుంది. ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కి పడిపోతుండటంతో క్రమంగా చలి పెరుగుతున్నది. దీంతో ఇళ్ల నుంచి జనం భయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత తగ్గకపోవడంతో పొలం పనులకు, కూలీలకు, ఆఫీసులకు వెళ్లేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. చలితీవ్రత పెరగడానికి ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటమే అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమ్రం భీం జిల్లాలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 7.5 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 8.3, నిర్మల్‌ జిల్లాలో 9.2, మెదక్‌ జిల్లా లింగాయిపల్లిలో 9.2, మంచిర్యాల జిల్లాలో 9.5, సిద్దిపేట జిల్లా హబ్సిపూర్‌లో 10.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాత్రిపూట చలి మరింత తీవ్రమవుతుందని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement