Wednesday, November 20, 2024

రాష్ట్రంపై చలి బాంబు.. సీజన్‌లో ఎన్నూడూ చూడనంత చలి, ఎల్లో అలర్ట్‌ జారీచేసిన వాతావరణశాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న నాలుగు రోజుల్లో ఈ సీజన్‌లో ఎన్నడూ చూడనంత చలి పెరుగనుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరభారతదేశంలో వీస్తున్న చలి గాలుల ప్రభావంతో చలి వణికించనుందని పేర్కొంది. తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలి తీవ్రత పెరగనున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. చలి తీవ్రతతో ఎక్కువ కావడంతోపాటు చలిగాలు వీయనున్నాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోచిరు జల్లులు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రెండు రోజుల క్రితం వరకు చలికాలంలో వేసవి పరిస్థితులు నెలకొనగా… క్రమక్రమంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడం, ముఖ్యంగా ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండడంతో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో ఉదయం, రాత్రి వేళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడున్న తేమ క్రమంగా దిగువకు వెళ్లిపోతోంది. రోనున్న రోజుల్లో ముఖ్యంగా 11వ తేదీ వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌, ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 28డిగ్రీలు నమోదు కాగా కనిష్ట ఉష్ణగ్రత 17డిగ్రీలుగా నమోదైంది.

మూడు రోజుల పాటు అక్కడక్కడా చిరు జల్లులు…

- Advertisement -

రానున్న మూడు రోజులపాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి కిందిస్థాయి తూర్పు ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం ఏర్పడిన తీవ్ర వాయిగుండం బలహీనపడి సాయంత్రానికి వాయుగుండంగా , ఆదివారం ఉదయం అయిదున్నగంటలకు తీవ్ర అల్పపీడనంగా మారిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement