గుజరాత్ రాష్ట్రంలో మరో భారీ డ్రగ్ డంప్ బయటపడింది. ఢిల్లి, గుజరాత్ పోలీసులు ప్రత్యేక జాయింట్ ఆపరేషన్‌లో దీనిని ఛేదించారు. అంక్లేశ్వర్ ప్రాంతంలో భారీ మొత్తంలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5000 కోట్లు ఉంటుందని అంచనా.
అంక్లేశ్వర్‌లోని అవ్కార్ డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీ ప్రాంగణంలో ప్రత్యేక పోలీసు బృందం దాడులు జరిపింది. ఈ సందర్భంగా 518 కేజీల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.
ఢిల్లి పోలీసులు ఇటీవల చేపట్టిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 700 కేజీల కొకైన్‌ను సీజ్‌చేశారు. అక్టోబర్1న దక్షిణ ఢిల్లిలోని మహిపాల్‌పూర్‌లో 500 కిలోల కొకైన్ పట్టుబడగా, రమేష్ నగర్ ప్రాంతంలో ఫార్మాసొల్యూషన్ సర్వీసెస్ అనే కంపెనీకి చెందిన 200 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇది గుజరాత్‌లోని అవ్కార్ డ్రగ్స్ లిమిటెడ్ నుంచి వచ్చినవిగా దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు మొత్తం 1289 కిలోల కొకైన్, 40 కిలోల హైడ్రోఫోనిక్ థాయ్ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. దీని మొత్తం విలువ రూ.13000 కోట్లపైమాటేనని అంచనా.