ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.31.29 కోట్ల విలువైన 4.47 కిలోల హెరాయిన్, రూ.15.96 కోట్ల విలువైన 1.596 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం కస్టమ్స్ అధికారులు తెలిపారు. డాక్యుమెంట్ ఫోల్డర్ కవర్‌లో రూ.31.29 కోట్ల విలువైన హెరాయిన్, షర్ట్ బటన్‌లో రూ.1.596 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇరువురు నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని 8 నిబంధలు ఉల్లంఘించినట్లు తెలిపారు. సెక్షన్ 21, 23, 29 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఎన్‌డీపీఎస్‌లోని సెక్షన్ 43(ఏ) క్రింద మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
గత డిసెంబర్‌లో కూడా గినియా జాతీయురాలిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రూ.15.36 కోట్ల విలువైన 82 క్యాప్సూల్స్ మహిళ తీసుకున్నట్లు.. అనుమానితురాలిగా గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లి.. కడుపులోకి తీసుకున్న.. 82 క్యాప్సూల్స్‌ను ఆపరేషన్ ద్వారా సేకరించినట్లు చెప్పారు. మహిళా కొనాక్రీ నుండి ఆడిస్ అబాబాకు ప్రయాణించిన మహిళ ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి గ్రీన్‌చానెల్ ద్వారా ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో ముందస్తు సమాచారం ప్రకారం కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోనికి తీసుకొని.. మింగిన నార్కోటిక్స్ క్యాప్సూల్స్‌ను బయటకు తీశామన్నారు.