Monday, November 25, 2024

ఢిల్లీలో సీఎన్‌జీ షాక్‌, 2.50 పెంపు.. కిలో ధర రూ.64.11

దేశంలో ద్రవ్యోల్బణం నిరంతరంగా ప్రజలకు షాక్‌లు ఇస్తూనే ఉంది. ఢిల్లిdలో సీఎన్‌జీ ధర మళ్లీ పెరిగింది. ఢిల్లీలో సీఎన్‌జీ ధర రూ.2.50 పెరగగా.. సోమవారం ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలో రూ.64.11కు చేరుకుంది. ఢిల్లికి ఆనుకుని ఉన్న నోయిడాలో పెట్రోల్‌, డీజెల్‌ తరువాత.. ఇప్పుడు సీఎన్‌జీ రేటును కూడా పెంచగా.. నోయిడాలో గత 24 గంటల్లో సీఎన్‌జీపై రూ.2.80 పైసలు పెరిగింది. సామాన్యుడు మరోసారి ద్రవ్యోల్బణం బారినపడ్డాడు. నాలుగు రోజుల్లో రెండోసారి సీఎన్‌జీ ధర పెరుగుదల నమోదైంది. ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌ (ఐజీఎల్‌) ఢిల్లిలో సీఎన్‌జీ ధరలను కిలోకు రూ.2.50కు పెంచింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి రోజునే సీఎన్‌జీ ధర కిలోకు 80పైసలు పెరిగింది.

పైప్‌ డ్​ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) ధరలను కూడా పెంచారు. ఇన్‌పుట్‌ గ్యాస్‌ ధర పెరుగుదలను కవర్‌ చేయడానికి ఈ పెంపుదల చేసినట్టు కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఐజీఎల్‌ దేశీయ క్షేత్రాల నుంచి సహజ వాయువును కొనుగోలు చేస్తుంది. అలాగే దిగుమతి చేసుకున్న ఎల్‌ఎన్‌జీని కొనుగోలు చేస్తుంది. స్పాట్‌ లేదా ప్రస్తుత మార్కెట్‌లో ఎల్‌ఎన్‌జీ ఇటీవలి నెలల్లో రికార్డు స్థాయికి చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement