Tuesday, January 7, 2025

TG | సీఎంఆర్ కాలేజీ ఘటన… మరో ఇద్దరి అరెస్ట్..!

సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ బాలికల హాస్టల్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన నంద కిషోర్, గోవింద్ కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తమపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిషోర్, గోవింద్‌లపై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. బాత్‌రూమ్‌లో ఫోన్‌ పెట్టి ప్రైవేట్‌ వీడియోలు రికార్డు చేశారంటూ విద్యార్థులు రోడ్డెక్కడంతో పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు.

దీంతో ఈ ఘ‌ట‌న‌లో ఏ1 నంద కిషోర్ కుమార్, ఏ2 గోవింద్ కుమార్‌ను అరెస్ట్ చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఏ3గా ధనలక్ష్మి, ఏ4గా అల్లం ప్రీతిరెడ్డి, ఏ5గా ప్రిన్సిపల్‌ అనంత నారాయణ, ఏ6గా కాలేజి డైరెక్టర్‌ మద్దిరెడ్డి జగన్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement