Friday, November 22, 2024

కోల్​, యాష్​ హ్యాండ్లింగ్​పై అసంతృప్తి.. భద్రాద్రి, యాదాద్రి పవర్​ ప్రాజెక్టులపై సీఎండీ సమీక్ష

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : యాదాద్రి, భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సూచించారు. శుక్రవారం రెండు విద్యుద్‌ ప్రాజెక్టుల పరోగతిపై బీహెచ్‌ఈఎల్‌, ఇతర అధికారులతో కలిసి సమీక్ష చేశారు. కూలింగ్‌ టవర్స్‌, కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌, యాష్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ పనులపై సీఎండీ ప్రభాకర్‌రావు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ప్రాజెక్టులోని అన్ని పనులను ఒకేసారి సమాంతరంగా చేపట్టాలని బెల్‌ అధికారులకు సూచించారు. నిర్దేశించిన సమయం మేరకు యూనిట్లన్నింటిని ప్రారంభించే విధంగా పనులు నిర్వహించాలని సూచించారు. ఎమైనా ఆటంకాలు ఎదురైతే వాటిని అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీహెచ్‌ఈఎల్‌ అధికారులు ఉపెందర్‌సింగ్‌, మిల్లింద్‌ , జెన్‌కో డైరెక్టర్‌ సచ్చిదానందం, అజయ్‌ తదిరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement