Saturday, November 23, 2024

అమెరికన్‌ కార్నర్‌ను ప్రారంభించనున్న సీఎం

ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ)లో ఏర్పాటు చేసిన అమెరికన్‌ కార్నర్‌ గురువారం నుంచి తన సేవలు ప్రారంభించనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్, యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా డైరెక్టర్‌ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులతో కలిసి  వీసీ పర్యవేక్షించారు.

దేశంలో ఇప్పటివరకు అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లలో మాత్రమే అమెరికన్ కార్నర్లు ఉన్నాయి. కొత్తగా విశాఖలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ భవనంలో అమెరికన్‌ కార్నర్‌  ఏర్పాటు కానుంది.  అమెరికన్‌ కార్నర్‌లో విద్యార్థులతో పాటు వినూత్నమైన ఆలోచనలు కలిగిన యువతకు మార్గదర్శకంగా ఉండేలా కార్యచరణ చేస్తారు. వారంలో ఒకటి నుంచి రెండు కార్యక్రమాలను వర్చువల్‌ విధానంలో ప్రస్తుతానికి నిర్వహించనున్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులతో పాటు ఎవరైనా వచ్చి ఇక్కడ సేవలను పొందవచ్చు. అంతర్జాతీయ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందేందుకు అనుగుణమైన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు.

ఇది కూడా చదవండి: ఆంధ్రప్రభ ఎఫెక్ట్: రాములోరి సాక్షిగా రూ.3 కోట్లు బొక్కేశారు!

Advertisement

తాజా వార్తలు

Advertisement