డీప్‌ఫేక్ పై కేంద్రం ఎన్ని చర్యలు చేపడుతున్న ఫలితం లేకుండా పోతుంది. డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోల కట్టడికి ప్రయత్నించిన వీడీ బెడద మాత్రం తప్పట్లేదు. సీని నటుల నుంచి ప్రముఖుల వరకు దీని బారీన పడుతూనే ఉన్నారు. తాజాగా యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌కు కూడా దాని బారీన పడ్డారు.
ఆయన డీప్‌ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డయాబెటిక్ ఔషధానికి ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది. మధుమేహ బాధితులు ఔషధాన్ని కొనుగోలు చేయాలంటూ ఆదిత్యనాథ్ ప్రోత్సహిస్తున్నట్లు కేటుగాళ్లు ఈ వీడియోను సృష్టించారు. ఓ న్యూస్ ఛానల్ క్లిప్‌లో ఆయన మాట్లాడుతున్నట్లుగా ఉంది. హజ్రత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నకిలీ వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
వారు బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు ప్రచారం చేస్తున్నట్లు మార్ఫింగ్ చేశారు. తీవ్ర ముప్పుగా మారుతున్న నకిలీ సమాచార వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని గుర్తించి వెంటనే తొలగించాలని సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులను కేంద్రం ఆదేశించింది.