Friday, November 22, 2024

Breaking: భద్రాచలం చేరుకోనున్న సీఎం.. హనుమకొండ నుంచి రోడ్డు మార్గంలోనే జర్నీ!

గోదావరి నదికి వరదలు పోటెత్తడంతో భద్రాచలం వద్ద గతంలో ఎన్నడూ లేని స్థాయిలో వరద ప్రవాహం కొనసాగింది. 71 అడుగులు దాటిన గోదావరి అందరినీ భయపెట్టింది. దీంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఇండ్లు, ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇంకా వరద ముంపు కొనసాగుతూనే ఉంది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇవ్వాల (ఆదివారం) సీఎం కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. హ‌నుమ‌కొండ‌ నుంచి ఇవ్వాల ఉద‌యం హెల‌క్యాప్ట‌ర్‌లో భ‌ద్రాచ‌లం వెళ్లాల్సి ఉండ‌గా.. వాతావ‌ర‌ణం అనుకూలించ‌లేదు. దీంతో రోడ్డు మార్గాన ములుగు, ఏటూరు నాగారం మీదుగా భద్రాచలం వెళ్తున్నారు సీఎం కేసీఆర్​.

అయితే షెడ్యూల్‌ ప్రకారం హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో రోడ్డు మార్గంలోనే వెళ్లాలని నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్​. కాగా, ములుగు, గోవిందరావుపేట మీదుగా ఏటూరునాగారం చేరుకుని, అక్కడి నుంచి భద్రాచలం వెళ్తున్నారు. అనంతరం వరద పరిస్థితిపై ప్రజాప్రతినిథులతో సమీక్ష నిర్వహిస్తారు. మంత్రులు, అధికారులకు సూచనలు చేయనున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం వెంట మంత్రులు హ‌రీశ్‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, స‌త్య‌వ‌తిరాథోడ్‌, సీఎస్ సోమేశ్ కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి, సీఎం కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ త‌దిత‌రులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement