Tuesday, November 26, 2024

గోవులను చంపారన్న నెపం.. ఇద్దరు గిరిజనుల హత్య.. సిట్​ దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం

గోవులను చంపారన్న అనుమానంతో ఇద్దరు గిరిజనులపై దాడి చేసిన ఘటనలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) విచారణకు ఆదేశిస్తున్నట్టు చెప్పారు మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​సింగ్​ చౌహాన్​. ఈ నెల 3వ తేదీన సియోని జిల్లాలో గోహత్య చేశారనే అనుమానంతో ఇద్దరు గిరిజనులను కొట్టి చంపారు. దీనికి సంబంధించి ఏఎస్పీ ఎస్కే మారావి తెలిపిన వివరాల ప్రకారం.. 15, 20 మంది కల గుంపు ఇద్దరు గిరిజనుల ఇంటికి వెళ్లింది. వారిని ఇంట్లో నుంచి బయటకి లాక్కొచ్చి విపరీతంగా కొట్టారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.

అంతలోనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండ గా మార్గ మధ్యలోనే చనిపోయారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో బయటపడ్డాడు. అని వివరించారు. అయితే దీనికి సంబంధించి కురై పోలీస్​ స్టేషన్​ మరియు బాదల్​పూర్​ పోస్ట్​లోని మొత్తం పోలీసు సిబ్బందిని తొలగించినట్టు చెప్పారు. దీనిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని, నిందితులు ఎవరైనా శిక్ష తప్పదని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement