Friday, January 10, 2025

TG | జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం !

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు (శుక్రవారం) జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో జరగనున్న భేటీలో సీఎం పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు, అధికారులకు సూచించారు.

ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల మీద కలెక్టర్లతో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement