నాగర్‌కర్నూల్ లోక్‌సభ మాజీ సభ్యుడు మందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. లోక్ సభ సభ్యునిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. వారి మరణం తెలంగాణకు తీరని లోటు అని పేర్కొన్నారు.
జగన్నాథం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
- Advertisement -