Friday, December 13, 2024

TG | సంక్షేమ గురుకులాల్లో రేపు సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీలు

  • సీఎంతో పాటు మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కూడా..

సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజన్‌ ​​అవుతున్నట్లు ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు సీఎం సహా మంత్రులు, ఐఏఎస్‌లంతా క్షేత్రస్థాయికి చేరుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు సంక్షేమ హాస్టళ్ల బాట పట్టనున్నారు.

రంగారెడ్డి, హైదరాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని ఏదో ఒక హాస్టల్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిస్థితిని నేరుగా సమీక్షించనున్నారు. సీఎం సహా సంక్షేమ హాస్టళ్లలో మంత్రులు, ఐఏఎస్ అధికారులు వివిధ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement