Thursday, December 12, 2024

TG | తెలంగాణ త‌ల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ !

ప్రజా పాలన విజయోత్సవాల్లో ఆఖ‌రి రోజును ఘనంగా ముగించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కొత్త రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహం సిద్ధమైంది. సచివాలయం ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయ‌గా.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్​ఛార్జి వీసీటీ. గంగాధర్ తెలంగాణ తల్లి చిత్రాన్ని గీయగా.. ప్రముఖ శిల్ప కళాకారుడు ఎంవీ రమణారెడ్డి కాంస్య విగ్రహంగా తీర్చిదిద్దారు. అభయహస్తం, బిగించిన‌ కొంగు, చేతిలో పంటలు, బంగారు రంగు అంచు ఉన్న పచ్చటి చీరతో కూడిన తెలంగాణ తల్లి విగ్రహం 17 అడుగులు కాగా.. బిగించిన పిడికిళ్లు చేతులతో నిలబెట్టుకుంటున్న సంకేతంతో మూడడగుల గద్దెతో కలిపి మొత్తం 20 అడుగుల విగ్రహం సిద్ధమైంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement