Thursday, November 28, 2024

Delhi | మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ !

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు (29న) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ హస్తినకు బ‌య‌ల్దేర‌నున్నారు.

కాగా, ఈ సమావేశానికి ఏఐసీసీ పెద్ద‌లు, పార్టీ అగ్ర‌నేతలు, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు హాజరుకానుండ‌గా.. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement