Friday, January 10, 2025

Revanth Reddy | 14న ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆస్ట్రేలియా పర్యటన రద్దు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. 15న ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రేవంత్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 14న ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆయన దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు.

అక్కడి నుంచి ఈ నెల 17న ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు సింగపూర్‌లో సీఎం రేవంత్ పర్యటిస్తారు. ఆ తర్వాత 19న సింగపూర్ నుంచి దావోస్ వెళ్తారు. 23వ తేదీ వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement