Monday, November 25, 2024

TS | ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంతం రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని.. MSP కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దని అధికారులని ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్లు రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement