Wednesday, December 25, 2024

TG | క్రైస్తవ బంధువులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు: సీఎం రేవంత్

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదర సోదరీమణులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు నేటికీ ప్రపంచంలో మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు.

అన్ని మతాల సారాంశం మానవత్వమని, ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవ వంటి గొప్ప లక్షణాలను అలవర్చుకోవాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శమని అన్నారు.

ఏసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. క్రైస్తవ మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

యేసు క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి మార్గదర్శకం: డిప్యుటీ సీఎం భట్టి

క్రిస్‌మస్‌ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు డిప్యూటీ సీఎం భట్టి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసు క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు.

సమస్త మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పంచే యేసుక్రీస్తు మార్గం అందరికీ అనుకూలమైనదన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమని, ఆయన ఎంచుకున్న మార్గమే అందరికీ దిక్సూచి అని, ప్రతిఒక్కరూ శాంతి, సహనం, కరుణతో ఉండాలని బోధించిన జీసస్ మాటలే నిత్యం నడవాల్సిన మార్గమన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement