Tuesday, November 26, 2024

Breaking: మహాలక్ష్మీ ఫ్రీ బస్ స్కీమ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

మహాలక్ష్మీ ఫ్రీ బస్ స్కీమ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించారు. ఆయనతో పాటుగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి, బాక్సర్ నిఖత్ జరీన్ లు ఈ బస్సు ప్రయాణాన్ని లాంఛనంగా ఆరంభించారు.ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని మంత్రులు ఉత్తమ్, భట్టి, పొన్నం, తదితరులు పాల్గొన్నారు.

ఈ పథకం ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి అమలు కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. సీఎస్ శాంతికుమారి, నిఖత్ జరీన్ లకు తొలి టికెట్ అందజేశారు.

అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10లక్షలకు పెంచారు. ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈ పథకాలను ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement