Wednesday, November 20, 2024

TG | మహిళా సాధికారికతకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట : మంత్రి సీతక్క

అచ్చంపేట, ప్రభ న్యూస్ : మహిళా సాధికారికత, ఆర్థిక స్వలంబన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అందులో భాగంగానే కోటి మంది మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా వడ్డీ లేని రుణాలను నేటి వరకు 20 వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన అభివృద్ది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధంసారి అనసూయ సీతక్క అన్నారు.

మంగళవారం అచ్చంపేట నియోజకవర్గములో పలు అభివృద్ధి కార్యక్రమాల పర్యటనలో భాగంగా అచ్చంపేట మండల పరిధిలోని ఏసిఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల రుణమేల సమావేశంలో మంత్రి సీతక్క అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తో కలిసి పాల్గొని అచ్చంపేట మండలం మహిళా సమాఖ్యలోని 67 స్వయం సహాయక సంఘాలకు ఆరు కోట్ల 50 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వము మహిళా సంఘాలకు ఇచ్చే డబ్బుతో పెట్టుబడులు పెట్టి ఆర్థిక ప్రగతి సాధించాలని కోరారు. మహిళలు స్త్రీ శక్తి స్వరూపాలని, మహిళల ఆర్థిక పురోభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారని అందులో భాగంగానే పొదుపు సంఘాల మహిళలకు 30 లక్షల మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫారాలు కుట్టి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకున్నారు అని, రెండో విడతగా మరల 30 లక్షల మంది విద్యార్థులకు స్కూలు యూనిఫారాలు కుట్టే బాధ్యత ఇవ్వడం జరిగిందని దీనివల్ల మహిళలు ఆర్థిక పరిపూర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.

అన్ని రంగాలలో మహిళలకు మొదటి వరుసలో స్థానం కల్పిస్తూ అమ్మ ఆదర్శ పాఠశాలలలో గ్రామ మహిళా సంఘాలకు అప్పగించి వారిని విద్యారంగంకు పెద్దపీట వేశారని అన్నారు. మహిళల ఆర్థిక పరిస్థితికి అనేక రకాలుగా మహిళా క్యాంటీన్లు, ఇందిరా స్త్రీ శక్తి కేంద్రాలుగా మీసేవ, ఈవెంట్ మేనేజ్మెంట్, మహిళా క్యాంటీన్లు, సోలార్ సిస్టం లాంటి 15 రంగాలలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా అగ్రభాగాన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెడుతున్నారని అన్నారు.

మహిళా మండలి సభ్యులు ప్రమాదంలో చనిపోతే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అలాగే రుణం తీసుకున్న మహిళలు అకారణంగా చనిపోతే వారు తీసుకున్న రుణాలలో కొంత భాగాన్ని మహిళా భరోసా కింద ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు.సెర్ఫ్ అనే సంస్థ ద్వారా పేదరిక నిర్మూలన ద్వారా గృహిణులు ఆర్థికంగా ఎదిగేలా 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ గ్రూపులో 74 లక్షల మహిళలు చేరారని ఈ సంఖ్యను కోటికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

- Advertisement -

హైదరాబాద్ శిల్పకళ వేదికలలో స్టాల్స్ ద్వారా మహిళా సంఘాలు చేసే ఉత్పత్తులను అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళా సంఘాలు నిబద్దతతో నిజాయితీతో ప్రేమానురాగాలతో నాన్నతో పాటిస్తే అద్భుతమైన ఫలితాలను సాధించి అందరికి ఆదర్శవంతంగా నిలిచి పరిపూర్ణమైన ఆర్థిక పరిపుష్టిని సాధించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement