దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI కొత్త చైర్మన్‌గా తెలంగాణకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు. ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలంగాణకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫారసు చేసింది.
తెలంగాణ రాష్ట్రం తరపున అభినందనలు : సీఎం రేవంత్ రెడ్డి
ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా శ్రీనివాసులు నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన ఎస్‌బీఐ చైర్మన్ పదవిని అధిరోహించడం గొప్ప సందర్భమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుకు నూతనంగా నియమితులైన చైర్మన్‌కు తెలంగాణ రాష్ట్రం తరపున అభినందనలు తెలిపారు. శ్రీనివాసులు తన కొత్త పాత్రలో అనేక విజయాలు మరియు ప్రశంసలతోపాటు పదవీకాలం కొనసాగాలంటూ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.