Friday, November 22, 2024

TG | కేంద్ర క్రీడా మంత్రితో సీఎం రేవంత్ భేటీ..

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యతో భేటీ అయ్యారు. సీఎంతోపాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా, మౌలిక సదుపాయాలు, గత విజయాలను దృష్టిలో ఉంచుకుని ఒలింపిక్స్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన క్రీడా కార్యక్రమాలను నిర్వహించేందుకు తెలంగాణను పరిగణలోకి తీసుకోవాలని రేవంత్ ప్రతిపాదించారు.

దాంతో పాటు తెలంగాణలో గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, సరూర్‌ నగర్‌ స్టేడియం వంటి ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నాయని….స్విమ్మింగ్, ఇతర వాటర్ స్పోర్ట్స్ వంటి వివిధ ఈవెంట్లను నిర్వహించగల సామర్థ్యం హైదరాబాద్‌కు ఉంద‌ని ఆయన హైలైట్‌ చేశారు.

యువ ప్రతిభను ప్రోత్సహించడానికి తెలంగాణలో స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ కి సంబంధించిన ప్రణాళికలను కేంద్ర మంత్రితో చర్చించారు. ఇక‌ జీఎంసీ బాలయోగి స్టేడియం, ఇతర సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఖేలో ఇండియా పథకం నిధులను పెంచాలని ఆయన కోరారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో హైదరాబాద్‌ను చేర్చాలని కూడా ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement