తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరారు. ఏఐసీసీ అంతర్గత సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మంగళవారం మధ్యాహ్నం ఇండియన్ ఎక్స్ ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొంటారు.
సాయంత్రం ఢిల్లీ నుంచి మహరాష్ట్రకు బయలుదేరి వెళతారు. బుధవారం మహరాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముంబైలోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
- Advertisement -