Thursday, November 21, 2024

TG | మాజీ సర్పంచ్‌లకు సీఎం రేవంత్‌ శుభవార్త..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గత ప్రభుత్వంలో నోటిమాటగా కొన్ని, వర్క్‌ ఆర్డర్‌తో మరికొన్ని గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులను చేయించిన నేపథ్యంలో పెండింగ్‌ బిల్లుల కోసం కొనసాగుతున్న సర్పంచ్‌ల ఆందోళనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించింది. పనులు పూర్తిచేసింది గత ప్రభుత్వంలో అయినా.. వర్క్‌ ఆర్డర్లు లేకున్నా.. గ్రామాల అభివృద్ధి జరిగిందన్న కోణంలో బిల్లుల చెల్లింపనకు సుముఖత వ్యక్తం చేసింది.

ఇందుకు సంబంధించి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆర్థిక, పంచాయతీరాజ్‌ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించి మార్గదర్శకాలు ఇచ్చారు. ఏకకాలంలో కాకుండా విడతల వారీగా బిల్లులు చెల్లించేందుకు నిధుల సమీకరణ చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

ఇప్పటి వరకూ పంచాయతీలకు సంబంధించి 750 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం క్లియర్‌ చేసింది. అయితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బకాయీ పెట్టిన 1,200 కోట్లకు పైగా పంచాయతీ బిల్లులు పెండింగ్‌ లో ఉన్నాయి. ఇటీవల కాలంలో బిల్లులు చెల్లించాలంటూ సర్పంచ్‌ లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. పలు చోట్ల ధర్నాలు చేసిన నేపథ్యంలో రేవంత్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement