Wednesday, October 9, 2024

TG | సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తీరొక్క పూలతో రూపొందించే ఘనమైన బతుకమ్మలతో ఆడిపాడే సంబురాల్లో ఆఖరి రోజైన సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని తెలంగాణలోని అక్కాచెల్లెళ్లందరకీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్‌ బండ్‌తో పాటు రాష్ట్రంలోని చెరువులన్నింటి వద్ద ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement