Sunday, January 19, 2025

Congress | ఢిల్లీ ఎన్నిక‌ల్లో స్టార్ క్యాంపెయిన‌ర్ గా సీఎం రేవంత్..

  • నియ‌మించిన కాంగ్రెస్ హై కమాండ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతను అప్పగించింది. రానున్న‌ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ని స్టార్‌ క్యాంపెయినర్గా నియ‌మించింది. రేవంత్ రెడ్డితో పాటు 40 మందిని కాంగ్రెస్ క్యాంపెయినర్లుగా నియమించింది.

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు ప్రచారకర్తల జాబితాలో ఉన్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్టార్ క్యాంపెయినర్లుగా ఢిల్లీ ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement