హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లల్లో కనీసం నెలకు ఒకసారైనా నిద్ర చేయాలని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని పేర్కొన్నారు. రాత్రి హాస్టళ్లలో కలెక్టర్లు బస చేసి పరిస్థితులు తెలుసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, విష జ్వరాలు, సౌర్యాల కొరతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్ ఆదేశాలకు ప్రాధాన్యత నెలకొంది.