రాజాపేట, (ప్రభన్యూస్) : కార్యకర్తలే గులాబీ పార్టీకి వీర సైనికులని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రాజాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిధి గృహంలో సీఎం బహిరంగ సభ పై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ కనివిని ఎరుగని రీతిలో జిల్లాలో సీఎం భారీ బహిరంగ సభ లక్ష మందితో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అన్నారు. 2014 కు ముందు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులను ప్రజలకు వివరించాలన్నారు. కేసీఆర్ సారధ్యంలో దేశంలోనే తెలంగాణ రోల్ మెడల్ గా నిలచిందన్నారు.
ఈ నెల 12న రాయగిరిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆలేరు నుంచి 40 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. యువజన, విద్యార్థి సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీగా సభ ప్రాంగణానికి రావాలని, ఆలేరు సత్తా మరోసారి చాటాలని పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..